Anand Shah: అమెరికాలో ఆనంద్ షాపై క్రిమినల్ కేసు 4 d ago

న్యూజెర్సీలోని భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా అక్రమ జూద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అమెరికా అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమ కార్డ్ గేమ్ లు,ఆన్‌లైన్ స్పోర్ట్స్ బుక్‌లను నిర్వహించాడని, షా అమెరికాలోని అతి ప్రమాదకరమైన మాఫియా గ్రూప్లలో ఒకటైన "లూచీస్" నేర కుటుంబంతో కలిసి పనిచేశాడని అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ పేర్కొన్నారు. అభియోగాలు మోపబడిన 39 మంది వ్యక్తులలో ఆయన ఒకరు. అధికారులు 12 ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. న్యూయార్క్ శివారు ప్రాంతమైన ప్రాస్పెక్ట్ పార్క్ ఆనంద్ షా మున్సిపల్ కౌన్సిలర్ గా రెండవసారి పనిచేస్తున్నారు. షా, గతంలో ఆర్థిక అభివృద్ధి, బీమా బాధ్యతలను నిర్వహించారు.